Monday, April 15, 2019

ఆకలి ఘోష

ఓ దేశమా, నాలోని పేగుల్ని ముడివేసి, ముద్దచేసి
మాంసపు తుండులా, పంచిపెట్టవా..!
నాలాంటివాళ్ల ఆకలి తీర్చవా...!!

ఓ దేశమా, నాలోని రక్తాన్ని ఒడపోషి
ఎర్రటి అన్నం మెతుకుల్లా, ఆకలి అక్షరాల్ని పంచిపెట్టవా ...!
నాలాంటివాళ్ల ఆకలికి దారి చూపవా...!!

ఓ దేశమా, నాలోని ఆకలిని మాత్రేమే తీసుకెళ్ళు..!
ఆకలితో పరితపంచి, యుద్ధంచేసి, ప్రాణం పోసైనా సరే, నా దేశాన్ని ఆకలి విముక్తి చేస్తా..!!

జై హింద్...


-----ఇ.పి.మంజునాథ్
(Inspired by Gunturu Seshendra - Adhunika Mahabharatam)